Microsoft ఆఫీస్ 2010 ఏర్పాటుకు ఎన్నో సాధనాలు
ఐటీ నిపుణులు వారి సిస్టమ్స్‌లో Office 2010ను ఏర్పాటు చేసుకునే క్రమంలో Office అప్లికేషన్ అనుకూలతా సమస్యలు, దాని సామర్థ్యంపై అంచనాలు, ప్రణాళికా కార్యకలాపాల్లో మీకు తోడ్పడేందుకు, మీకు కావలసినట్లుగా Office 2010ను ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడే నాలుగు సరికొత్త సాఫ్ట్‌వేర్ సాధనాల గురించి తెలుసుకోండి.
1. Microsoft Assessment & Planning Toolkit 5.0 (MAP)
Office 2010 ఏర్పాటు క్రమంలో ఐటీ నిపుణుల అంచనాలు, ప్రణాళికలకు MAP చేయూతనిస్తుంది. కొత్త టెక్నాలజీలోకి అంటే... ప్రస్తుతం Office 2010లోకి మారే కంప్యూటర్లు అందుకు తగినట్లు సిద్ధంగా ఉన్నాయా లేదా అనే విషయాల్ని ఈ సాఫ్ట్‌వేర్ ధృవీకరిస్తుంది. ఇందుకు సిద్ధం చేసుకున్న కంప్యూటర్లలో మరే ఇతర కాంపోనెంట్స్ ఇన్‌స్టాల్ చెయ్యాల్సిన అవసరం లేకుండానే వాటిని మీ నెట్‌వర్క్ ద్వారా MAP కనుగొంటుంది. సిస్టం సామర్థ్యాన్ని ధృవీకరించడం, అంచనాలు వేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీనే MAP ఉపయోగించుకుంటుంది. ఇందులో రిమోట్ రిజిస్ట్రీ సర్వీస్ అయిన Windows Management Instrumentation (WMI), Active Directory Domain Services, కంప్యూటర్ బ్రౌజర్ సర్వీస్ తదితరాలు ఉంటాయి. MAP యొక్క అన్ని శక్తి సామర్థ్యాల గురించీ MAP వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
గతంలో MAP 5.0పై వచ్చిన ప్రతిస్పందన మేరకు దానిని అభివృద్ధి చెయ్యడం జరిగింది. Office 2010 యొక్క సన్నద్ధతపై నమూనా నివేదికల్ని మీరు పొందవచ్చు.
2. Office Environment Assessment Tool (OEAT)
క్లయింట్ కంప్యూటర్లలో Office 97, Office 2000, Office XP, Office 2003, 2007 Office సిస్టం మరియు Office 2010తో ఇంటరాక్ట్ కావడానికి కావలసిన add-ins, అప్లికేషన్ల కోసం OEAT స్కాన్ చేస్తుంది. Office 2010కు మైగ్రేషన్ ప్లానింగ్‌లో భాగంగా అప్లికేషన్ సామర్థ్యాన్ని అంచనా వేసే ఐటీ నిపుణులు ఈ సాఫ్ట్‌వేర్ టూల్‌ని రూపొందించారు. కనుగొన్న add-inలు, అప్లికేషన్లను Microsoft Independent Software Vendor (ISV) Application Compatibility Visibility Programకు సమర్పించేందుకుగాను అనుకూలంగా ఉన్నట్లు ISVలు ధృవీకరించిన add-ins జాబితాతో సరిపోల్చే సామర్థ్యం ఈ టూల్‌కు ఉంది. విక్రేత పేరు, ఉత్పత్తి పేరు, వెర్షన్ పేరు, ఫలితాలు పాక్షికమా లేక కచ్చితంగా సరిపోలాయా అనే సారాంశ నివేదికను స్ప్రెడ్‌షీట్ ద్వారా తెలియజేస్తుంది. మరింత సమాచారం కోసం టెక్నికల్ లైబ్రరీలోని Microsoft Office Environment Assessment Tool యూజర్ గైడ్ చదవండి.
3. Office 2010 Code Compatibility Inspector (OCCI)
Microsoft Visual Basic for Application (VBA) మేక్రోలు మరియు add-insతో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు, స్థిరపరిచేందుకు Microsoft Excel 2010, Microsoft PowerPoint 2010, Microsoft Word 2010 మరియు Microsoft Visual Studio 2008లో డెవలపర్లు ఉపయోగించే OCCI అనే add-in ఉపయోగిస్తారు. Office 2010లోకి మారే క్రమంలో VBA కోడ్‌లో ఎదురయ్యే సమస్యల్ని సరిదిద్దడానికి గాను డెవలపర్లకు ఈ టూల్ సహకరిస్తుంది. ఒక ప్రాజెక్ట్‌లో అనుకూలతకు సంబంధించి ఊహించిన సమస్యల గురించి కోడ్‌ను ఈ టూల్ పరిశీలిస్తుంది. ఆబ్జెక్ట్ మాడల్ నుంచి కోడ్‌లోని అంశాల్లో జరిగిన ఏవైనా మార్పులు లేదా తొలగింపులపై ఇది మీకు సమాచారమిస్తుంది. మరింత సమాచారం కోసం టెక్నికల్ లైబ్రరీలోని Microsoft Office Code Compatibility Inspector యూజర్ గైడ్ చదవండి.
4. Microsoft Deployment Toolkit 2010 Update 1 (MDT 2010)
Office 2010 ఏర్పాటుకు MDT 2010 ఒక చక్కని మార్గాన్ని సిద్ధం చేస్తుంది. Office Customization Toolను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం మరియు Office config.xml సెట్టింగులను కావలసిన రీతిలో సులభంగా మార్చుకోవడం వంటి కార్యకలాపాలకు మంచి తోడ్పాటునిస్తుంది. Office 2010 ఏర్పాటులో MDT 2010ను ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకోవడానికి Springboard Series బ్లాక్ చూడండి. పూర్తిస్థాయిలో ఈ ప్యాకేజీ ఏర్పాటు కోసం ఇప్పుడే MDT 2010 Update 1ను అందుకుని MDT 2010ను ఉపయోగించడం మొదలుపెట్టండి.
ఈ టూల్స్ ఏ విధంగా పనిచేస్తాయో మీరు వీక్షించాలనుకుంటే మీకు సహకరించేందుకుగాను Proof of Concept (POC) kit అందుబాటులో ఉంది. ఒక నియంత్రిత పరిస్థితిలో Office 2010, Windows 7 Enterprise, Internet Explorer 8 మరియు Application Virtualization (App-V) ఏర్పాటు ప్రక్రియలో సహకరించేలా PoC Jumpstart రూపకల్పన జరిగింది. డెస్క్‌టాప్‌లో పూర్తి స్థాయి ఏర్పాటుకు త్వరితగతిన మీకు సహకరించడం కోసం పైన పేర్కొన్న టూల్స్, ఇతర సాఫ్ట్‌వేరు సాధనాల గురించి Microsoft Proof of Concept Jumpstart kit ద్వారా తెలుసుకోవచ్చు. PoC Jumpstart kit గురించి Springboard Series సైట్ నుంచి కూడా ఎన్నో వివరాలు పొందవచ్చు.