Go Search

Windows 7లో పేరెంటల్ కంట్రోల్స్

 

      మన ఇంట్లోని చిన్నపిల్లలు ఇంటర్నెట్ చూడాలనుకుంటే వారికిప్పుడు పెద్దవారి సహాయం ఎంతమాత్రం అవసరం లేదు. PCలోకి లాగ్ ఇన్ కావడం, అనంతరం ఇంటర్నెట్‌లోకి ప్రవేశించడం, వారికి నచ్చిన Online గేమ్స్ ఆడుకోవడం ఎలాగన్నది వారికి బాగా తెలుసు. మన పిల్లలకు మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉందని మనం సంతోషపడటం సహజమేగానీ వారు పరిమితులు దాటకుండా చూసుకోవడమెలాగన్నది మనకెప్పుడూ ఆందోళన కలిగించే అంశమే. అయితే వారిని బలవంతంగా ఆపడానికి చేసే ప్రయత్నాలు మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు...

 

మరి పరిష్కారం ఏమిటి ?

 

ఈ విషయంలో మనకు Windows 7లోని పేరెంటల్ కంట్రోల్స్ ఎంతో ఉపయోగపడతాయి. మన పిల్లలు ఎలాంటి గేమ్స్ ఆడాలి? ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలి ? వంటివి పెద్దలే నిర్ణయించవచ్చు. అంతెందుకు... వారు ఏ ఏ సమయాల్లో కంప్యూటర్‌ను వాడుకోవాలన్నది కూడా ముందుగానే నిర్ణయించవచ్చు.

 

ఇందుకోసం మీరు చెయ్యాల్సిందల్లా... మీ కోసం (పెద్దలు) ఒక administrator accountను సెట్ చేసుకుని, పిల్లలు ఒకొక్కరికీ ఒక standard user account సెట్ చేసి, వారికోసం మీరు అమలు చెయ్యదల్చిన Parental controlsను మీ ఇష్టానుకారం అమర్చండి. తర్వాత పిల్లలు ఎప్పుడు కంప్యూటర్‌లోకి login అయినా, వారి accountsకు మీరు నిర్దేశించిన controls ప్రకారమే పనిచేసుకోవాల్సి ఉంటుంది.

 

Windows 7లోని పేరెంటల్ కంట్రోల్స్‌ను మన అవసరాలకు తగినట్లుగా అమర్చుకోవడం ఎంతో సులభం. ఉదాహరణకు చెప్పాలంటే, రోజూ సాయంత్రం మీ పిల్లలు బడి నుంచి తిరిగివచ్చాక వారికి అల్పాహారం ఇచ్చి, కాసేపు తోటిపిల్లలతో ఆడుకున్న తర్వాతే కంప్యూటర్‌లో వారి account పనిచేసేలా అమర్చవచ్చు. ఒక రోజులో లేదా వారంలో ఇన్ని గంటలు మాత్రమే కంప్యూటర్‌ను వారు పరిమితంగా ఉపయోగించుకునేలా వాడుక సమయాన్ని నిర్ణయించవచ్చు.

 

Webలో నియంత్రణల మాటేమిటి?

 

పిల్లలు కంప్యూటర్‌ను ఉపయోగించుకోవడం ఒక అంశమైతే, వారు ఇంటర్నెట్‌లోకి అడుగుపెట్టాక రకరకాల ప్రభావాలకు లోనుగాకుండా వారిని కట్టడి చెయ్యడం నిజంగా ఒక సవాల్ వంటిది. ఈ విషయంలో తల్లిదండ్రుల ఆందోళన అర్థవంతమైంది. ఏ రకమైన Web content పిల్లలకు అందుబాటులో ఉండాలన్నది నిర్ణయించడానికి, ఇంటర్నెట్‌లో మన పిల్లల కార్యకలాపాల్ని గమనిస్తూ సమాచారమిచ్చే వ్యవస్థలు Windows Vista, Windows 7లో ఉన్నాయి.

 

గతంలో అయితే, ప్రతి PCలోనూ web filtering మరియు reports కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చేది. ఇప్పుడు Windows 7లో పరిస్థితి మరింత మెరుగైంది. Windows Live Family Safety అనే Web ఆధారిత ప్రోగ్రాం ద్వారా మీ PCలలో ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన reports చూడవచ్చు, సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

 

ప్రస్తుతం చాలా PCలలో Family Safety ప్రోగ్రాం ముందుగానే సిద్ధమై ఉంటున్నది. ఒకవేళ మీ కంప్యూటర్‌లో అలా లేనట్లయితే, దీనిని Windows Live Family Safety webpage ద్వారా ఉచితంగా పొందవచ్చు.

Read More on...

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.