Skip Ribbon Commands
Skip to main content

​​​​​​​​​​

​​

ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్‌‌లను ఇన్‌స్టాల్ చేయడం మరియు ఉపయోగించడం


స్టాండర్డ్ విండోస్ ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్‌‌లను  ఇన్‌స్టాల్ చేయడం ఉపయోగించడంపై  ఈ ఆర్టికల్ ట్యూటోరియల్‌ని అందిస్తుంది.

ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్‌‌లను ఇన్‌స్టాల్ చేయడం

నాలుగు తూర్పు ఆసియా భాషలకు చెందిన సంక్లిష్టమైన క్యారెక్టర్లను నమోదు చేయడానికి ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్‌‌లను ఇన్‌స్టాల్ చేయడం మరియు ఉపయోగించడం గురించి  దిగువ సెక్షన్‌లు వివరిస్తాయి. ప్రతి భాషకు ప్రత్యేకంగా ఉన్న ఫీచర్ల గురించి చర్చించబడ్డాయి.

ఒక అప్లికేషన్‌లో న్‌పుట్ మెథడ్ ఎడిటర్‌‌(IME) ఫంక్షనాలిటీని అమలు చేయడం కొరకు, ఒక గేమ్‌లో న్‌పుట్ మెథడ్ ఎడిటర్‌‌ ఉపయోగించడం చూడండి.

డిఫాల్ట్‌గా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్‌పి మీద IME ఇన్‌స్టాల్ చేయబడదు. ఇన్‌స్టాల్ చేయడం కొరకు, దిగువ దశల్ని పూర్తి చేయండి.

Ee418266.wedge(en-us,VS.85).gif

ఒక IME ఇన్‌స్టాల్ చేయడానికి

  1. కంట్రోల్ ప్యానెల్ నుంచి రీజనల్ మరియు లాంగ్వేజ్ ఆప్షన్‌లను ఓపెన్ చేయండి.
  2. లాంగ్వేజస్ ట్యాబ్ మీద, తూర్పు ఆసియా లాంగ్వేజస్ చెక్‌బాక్స్ కొరకు ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయడం ఎంచుకోండి. 


ఒక  ఇన్‌స్టాల్ సప్లిమెంటల్ లాంగ్వేజ్ సపోర్ట్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది లాంగ్వేజ్ ఫైళ్ల కొరకు అవసరమైన స్టోరేజీ ఆవశ్యకతల గురించి ఇది మీకు తెలియజేస్తుంది. 
  1. డయలాగ్ బాక్స్ క్లోజ్ చేయడం కొరకు ఒకే మీద క్లిక్ చేయండి.
  2. లాంగ్వేజస్ ట్యాబ్ మీద ఒకేని క్లిక్ చేయండి.
  3. విండోస్ ఎక్స్‌పి ఇన్‌స్టలేషన్ డిస్క్ లేదా లాంగ్వేజ్ సపోర్ట్ ఫైళ్లు ఉన్న నెట్‌వర్క్ షేర్ లొకేషన్‌ని కోరుతూ మరో డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. విండోస్ ఎక్స్‌పి కాంపాక్ట్ డిస్క్ చొప్పించండి లేదా సరైన నెట్‌వర్క్ లొకేషన్ ఎంచుకోండి మరియు ఒకే మీద క్లిక్ చేయండి. మైక్రోసాఫ్ట్ విండోస్ అవసరమైన ఫైళ్లను ఇన్‌స్టాల్ చేస్తుంది మరియు కంప్యూటర్‌ని రీస్టార్ట్ చేయమని మీకు ప్రాంప్ట్ చేస్తుంది.
  4. కంప్యూటర్ రీ స్టార్ట్ చేయడం కొరకు ఎస్ మీద క్లిక్ చేయండి.
  5. రీ స్టార్ట్ చేసిన తరువాత, రీజనల్ మరియు లాంగ్వేజ్ ఆప్షన్‌ల కంట్రోల్ ప్యానెల్‌ని మరోసారి ఓపెన్ చేయండి.
  6. లాంగ్వేజస్ ట్యాబ్ మీద, వివరాలను క్లిక్ చేయండి. టెక్ట్స్ సర్వీసులు మరియు ఇన్‌పుట్ భాషల విండో కనిపిస్తుంది.      

  1. సెట్టింగ్స్ ట్యాబ్ మీద, యాడ్‌ని క్లిక్ చేయండి. యాడ్ ఇన్‌పుట్ లాంగ్వేజ్ విండో కనిపిస్తంది.      

  1. ఇన్‌పుట్ లాంగ్వేజ్ కొరకు చైనీస్(తైవాన్) ఎంచుకోండి మరియు లేవుట్/IME కొరకు మైక్రోసాఫ్ట్ న్యూ ఫోనెటిక్ IME 2002a ఎంచుకోండి.
  2. ఓకేని క్లిక్ చేయండి. ఇదే రీతిలో మీరు ఇతర భాషలను మరియు IMEలను జోడించాల్సి ఉంటుంది.
  3. యాడ్ ఎగైన్ క్లిక్ చేయండి, ఇన్‌పుట్ భాషగా చైనీస్(PRC)ని మరియు చైనీస్(సింప్లిఫైడ్)ని ఎంచుకోండి- మైక్రోసాఫ్ట్ పినియన్ IME 2.0ని కీబోర్డ్ లేవుట్/IME కొరకు ఎంచుకోండి, తరువాత ఒకేని క్లిక్ చేయండి.
  4. యాడ్ ఎగైన్‌ని క్లిక్ చేయండి, ఇన్‌పుట్‌ భాషగా జపనీస్ మరియు మైక్రోసాఫ్ట్ IME స్టాండర్డ్ 2002 వెర్షన్. 8.1ని కీబోర్డ్ లేవుట్‌/IMEగా ఎంచుకోండి, తరువాత ఒకేని క్లిక్ చేయండి. 
  5. యాడ్ ఎగైన్ క్లిక్ చేయండి, ఇన్‌పుట్ భాషగా కొరియన్‌ని ఎంచుకోండి- కొరియన్ ఇన్‌పుట్ సిస్టమ్(IME2002)ని  కీబోర్డ్ లేవుట్/IME కొరకు ఎంచుకోండి, తరువాత ఒకేని క్లిక్ చేయండి. టెక్ట్స్ సర్వీసులు మరియు ఇన్‌పుట్ భాషల విండోల, ఇన్‌స్టల్ చేయబడ్డ సర్వీసుల జాబితా బాక్సులో ఇప్పుడు నాలుగు కొత్తగా జోడించబడ్డ IMEలు ఉంటాయి. 

  1. టెక్ట్స్ సర్వీసులు మరియు ఇన్‌పుట్ లాంగ్వేజ్‌ల విండోని క్లోజ్ చేయడం కొరకు ఒకేని క్లిక్ చేయండి.
  2. రీజనిల్ మరియు లాంగ్వేజ్ ఆప్షన్‌ల కంట్రోల్ ప్యానెల్ క్లోజ్ చేయడం కొరకు ఒకేని క్లిక్ చేయండి. విండో టాస్క్ బార్‌లోని  ఇన్‌పుట్ లోకల్ ఇండికేటర్ ఇప్పుడు ఎరుపు రంగులో వృత్తం చేయబడుతుంది. ఇండికేటర్ ఉండటం , సిస్టమ్ మీద ఒకటి కంటే ఎక్కువ ఇన్‌పుట్ లాంగ్వేజ్‌లు ఇన్‌స్టాల్ చేయబడినట్లుగా తెలియజేస్తాయి.
Indicator that signifies that more than one input language has been installed on the system

సింప్లిఫైడ్ చైనీస్ IME

కొన్ని సింప్లిఫైడ్ చైనీస్ క్యారెక్టర్లను నమోదు చేయడం కొరకు నోట్‌పాడ్‌తో సంప్రదాయ చైనీస్ IME(పిన్ యాన్)ని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఈ సెక్షన్ వివరిస్తుంది.

  1. నోట్‌ప్యాడ్‌ని లాంఛ్ చేయండి( స్టార్ట్ బటన్‌ నుంచి లభ్యం అవుతుంది, తరువాత ఆల్ ప్రోగ్రామ్‌లు మరియు యాక్ససరీలు ఎంచుకోండి) నోట్‌ప్యాడ్‌లో కొన్ని క్యారెక్టర్లు టైప్ చేయండి. ఈ క్యారెక్టర్లు CTRL విండోని తరువాత మరింత మెరుగ్గా విజువలైజ్ చేయడానికి మీకు సహాయపడుతుంది. 

  1. నోట్‌ప్యాడ్‌ని యాక్టివ్ అప్లికేషన్ వలే, ఇన్‌పుటల్ లొకల్ ఇండికేటర్‌ క్లిక్ చేయండి మరియు చైనీస్(PRC) ఎంచుకోండి. కొత్త ఇన్‌పుట్ లాంగ్వేజ్ చైనీస్(PRC) అనే విషయాన్ని ప్రతిబింబించడం కొరకు ఇండికేటర్ డిస్‌ప్లే CHకు మారుతుంది.
Input locale indicator to select Chinese (PRC)
కర్సర్‌ని నోట్‌ప్యాడ్‌లో ఉంచండి. కీబోర్డు మీద హోమ్‌ని ప్రెస్ చేయండి, తద్వారా కర్సర్ లైన్  ప్రారంభంలో ఉంటుంది. కీబోర్డు మీద "N", తరువాత "I"ని టైప్ చేయండి. డిస్‌ప్లే  అప్పియరెన్స్‌ని దిగువ పటం చూపుతుంది. చిన్న హారిజాంటల్ దీర్ఘచతురస్రాకారం  రీడింగ్ విండో, ఇది ప్రస్తుత రీడింగ్ స్ట్రింగ్‌ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం, "N" మరియు "I" టైపింగ్ చేయడం ఫలితంగా రీడింగ్ స్ట్రింగ్ "ni" వలే ఉంటుంది
  1. "3" టైప్ చేయండి. ఇప్పుడు నోట్‌ప్యాడ్‌కు దిగువ డిస్‌ప్లే ఉంటుంది. N+I+3  సరళీకృత చైనీస్ పినియన్‌లో ఒక పూర్తి ఉచ్ఛారణ కనుక, యూజర్ నమోదు చేయాలని భావించే క్యారెక్టర్‌ని ఊహించడానికి IMEకి తగినంత సమయం ఉంటుంది. మీరు ఒక పూర్తి ఉచ్ఛారణను ఎంటర్ చేశారు కనుక రీడింగ్ విండో అదృశ్యం అవుతుంది. నోట్‌ప్యాడ్ కర్సర్  పైన ఒక క్యారెక్టర్ డిస్‌ప్లే అవుతుంది. ఈ క్యారెక్టర్ నోట్‌ప్యాడ్‌లో భాగం కాదు, నోట్‌ప్యాడ్  పైన మరో విండోలో డిస్‌ప్లే అవుతుంది మరియు మధ్యలో ఉన్న నోట్‌ప్యాడ్‌లో ఇప్పటికే ఉన్న క్యారెక్టర్లను దాచిపెడుతుంది. కొత్త విండోని కంపోజిషన్ విండో అని అంటారు, మరియు స్ట్రింగ్‌ని కంపోజిషన్ స్ట్రింగ్ అని అంటారు. కంపోజిషన్ స్ట్రింగ్ డిస్‌ప్లేలో అండర్‌లైన్ చేయబడుతుంది,. 

  1. మరో క్యారెక్టర్ నమోదు చేయడం కొరకు "H", "A", "O", "3"ని ఇప్పుడు టైప్ చేయండి. "H"ని టైప్ చేసినప్పుడు కనపడి మరియు "3"ని టైప్ చేసినప్పుడు రీడింగ్ విండో అదృశ్యం అవుతుందనే విషయాన్ని గమనించండి. దిగువ చూపించినవిధంగా, కంపోజిషన్ స్ట్రింగ్‌లో ఇప్పుడు రెండు క్యారెక్టర్లు ఉన్నాయి.      

  1. ఒక్కసారి కీబోర్డు మీద లెఫ్ట్ యారోని ప్రెస్ చేయండి. మీరు రెండో క్యారెక్టర్ టైప్ చేసేటప్పుడు, కంపోజిషన్ కర్సర్ ఒక క్యారెక్టర్‌‌ని ఎడమకు కదిలిస్తుంది. దిగువ చూపించిన విధంగా నోట్‌ప్యాడ్  పైన ఒక విండో కనిపిస్తుంది. ఈ విండోని క్యాండిడేట్ విండో అని అంటారు. మీరు టైప్ చేసిన దాని  ఉచ్ఛారణకు జత అయ్యే క్యారెక్టర్లు లేదా క్లాజుల జాబితాను ఇది ప్రదర్శిస్తుంది. క్యాండిటేట్‌ల జాబితాలోని ఎంట్రీల నుంచి ఉద్దేశించబడ్డ పదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ ఉదాహరణలో, ఒకే ఉచ్ఛారణతో రెండు క్యాండిడేట్ క్యారెక్టర్లు లభ్యం అవుతున్నాయి. 

రెండో ఎంట్రీని ఎంచుకోవడం కొరకు ‘‘2’’ని టైప్ చేయండి. క్యాండిడేట్ విండో క్లోజ్ అవుతుంది, మరియు ఎంచుకోబడ్డ క్యారెక్టర్‌తో కంపోజిషన్ స్ట్రింగ్ అప్‌డేట్ చేయబడుతుంది.
  1. ఎంటర్‌ని నమోదు చేయండి. కంపోజిషన్ పూర్తయిందని మరియు స్ట్రింగ్ నోట్‌ప్యాడ్‌కు పంపబడిందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది- ఈ ఉదాహరణలో నోట్‌ప్యాడ్. కంపోజిషన్ విండో క్లోజ్ అవుతుంది, మరియు రెండు క్యారెక్టర్లు WM_CHARద్వారా నోట్‌ప్యాడ్‌కు పంపబడుతుంది. దిగువ పటంలో అండర్‌లైన్ పోతుంది, ఎందుకంటే చూపించబడ్డ రెండు క్యారెక్టర్లు నోట్‌ప్యాడ్‌లోని టెక్ట్స్  భాగాలుగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న నోట్‌ప్యాడ్‌లో ఉన్న టెక్ట్స్ "ABCDEFG" కుడివైపుకు తరలించబడుతుంది, ఎందుకంటే మరో రెండు క్యారెక్టర్లు చొప్పించబడ్డాయి. మీరు ఇప్పుడు విజయవంతంగా రెండు సింప్లిఫైడ్ చైనీస్ క్యారెక్టర్లను IME ఉపయోగించి నమోదు చేశారు. 

సంప్రదాయ చైనీస్ IME

కొన్ని సంప్రదాయ చైనీస్ క్యారెక్టర్లను నమోదు చేయడం కొరకు నోట్‌పాడ్‌తో సంప్రదాయ చైనీస్ IMEని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఈ సెక్షన్ వివరిస్తుంది.

నోట్‌ప్యాడ్ లాంఛ్ చేయండి. నోట్‌ప్యాడ్‌లో కొన్ని క్యారెక్టర్లు టైప్ చేయండి. ఈ క్యారెక్టర్లు CTRL విండోని తరువాత మరింత మెరుగ్గా విజువలైజ్ చేయడానికి మీకు సహాయపడుతుంది


  1. విండోస్ టాస్క్‌బార్ మీద ఇన్‌పుట్ లోకల్ ఇండికేటర్ మీద క్లిక్ చేయండి మరియు చైనీస్(తైవాన్)ఎంచుకోండి. కొత్త ఇన్‌పుట్ లాంగ్వేజ్ చైనీస్(తైవాన్) అనే విషయాన్ని ప్రతిబింబించడం కొరకు ఇండికేటర్ డిస్‌ప్లే CHకు మారుతుంది. 

  1. కర్సర్‌ని నోట్‌ప్యాడ్‌లో ఉంచండి. కీబోర్డు మీద హోమ్‌ని ప్రెస్ చేయండి, తద్వారా కర్సర్ లైన్  ప్రారంభంలో ఉంటుంది. కీబోర్డు మీద "S", తరువాత "U"ని టైప్ చేయండి. డిస్‌ప్లే  అప్పియరెన్స్‌ని దిగువ పటం చూపుతుంది. చిన్న వర్టికల్ దీర్ఘచతురస్రాకారం  రీడింగ్ విండో, ఇది ప్రస్తుత రీడింగ్ స్ట్రింగ్‌ని ప్రదర్శిస్తుంది. దిగువ పటంలో చూపించిన విధంగా, రీడింగ్ స్ట్రింగ్‌కు "S" మరియు "U" టైప్ చేయడం ఫలితంగా రెండు క్యారెక్టర్లు ఉంటాయి.      

"3" టైప్ చేయండి. ఇప్పుడు నోట్‌ప్యాడ్‌కు దిగువ డిస్‌ప్లే ఉంటుంది. S+U+3 సంప్రదాయ ఛైనీస్‌లో ఒక పూర్తి ఉచ్ఛారణ కనుక, యూజర్ నమోదు చేయాలని భావించే క్యారెక్టర్‌ని ఊహించడానికి IMEకి తగినంత సమయం ఉంటుంది. మీరు ఒక పూర్తి ఉచ్ఛారణను ఎంటర్ చేశారు కనుక రీడింగ్ విండో అదృశ్యం అవుతుంది. నోట్‌ప్యాడ్ కర్సర్  పైన ఒక క్యారెక్టర్ డిస్‌ప్లే అవుతుంది. ఈ క్యారెక్టర్ నోట్‌ప్యాడ్‌లో భాగం కాదు, నోట్‌ప్యాడ్  పైన మరో విండోలో డిస్‌ప్లే అవుతుంది, మధ్యలో ఉన్న నోట్‌ప్యాడ్‌లో ఇప్పటికే ఉన్న క్యారెక్టర్లను దాచిపెడుతుంది. కొత్త విండోని కంపోజిషన్ విండో అని అంటారు, మరియు స్ట్రింగ్‌ని కంపోజిషన్ స్ట్రింగ్ అని అంటారు. కంపోజిషన్ స్ట్రింగ్ డిస్‌ప్లేలో అండర్‌లైన్ చేయబడుతుంది,. 
  1. మరో క్యారెక్టర్ నమోదు చేయడం కొరకు "C", "L", మరియు "3"ని ఇప్పుడు టైప్ చేయండి.  "C"ని టైప్ చేసినప్పుడు కనపడి మరియు "3"ని టైప్ చేసినప్పుడు రీడింగ్ విండో అదృశ్యం అవుతుందనే విషయాన్ని గమనించండి. దిగువ చూపించినవిధంగా, కంపోజిషన్ స్ట్రింగ్‌లో ఇప్పుడు రెండు క్యారెక్టర్లు ఉన్నాయి.      

  1. ఒక్కసారి కీబోర్డు మీద డౌన్ యారోని టైప్ చేయండి దిగువ చూపించిన విధంగా నోట్‌ప్యాడ్  పైన ఒక విండో కనిపిస్తుంది. ఈ విండోని క్యాండిడేట్ విండో అని అంటారు. మీరు టైప్ చేసిన దాని  ఉచ్ఛారణకు జత అయ్యే క్యారెక్టర్లు లేదా క్లాజుల జాబితాను ఇది ప్రదర్శిస్తుంది. క్యాండిటేట్‌ల జాబితాలోని ఎంట్రీల నుంచి ఉద్దేశించబడ్డ పదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ ఉదాహరణలో, ఒకే ఉచ్ఛారణతో మూడు క్యాండిడేట్ క్యారెక్టర్లు లభ్యం అవుతున్నాయి. 

రెండో ఎంట్రీని ఎంచుకోవడం కొరకు ‘‘2’’ని టైప్ చేయండి. క్యాండిడేట్ విండో క్లోజ్ అవుతుంది, మరియు ఎంచుకోబడ్డ క్యారెక్టర్‌తో కంపోజిషన్ స్ట్రింగ్ అప్‌డేట్ చేయబడుతుంది
  1. ఎంటర్‌ని నమోదు చేయండి. కంపోజిషన్ పూర్తయిందని మరియు స్ట్రింగ్ నోట్‌ప్యాడ్‌కు పంపబడిందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది- ఈ ఉదాహరణలో నోట్‌ప్యాడ్. కంపోజిషన్ విండో క్లోజ్ అవుతుంది, మరియు రెండు క్యారెక్టర్లు WM_CHARద్వారా నోట్‌ప్యాడ్‌కు పంపబడుతంది.. దిగువ పటంలో అండర్‌లైన్ పోతుంది, ఎందుకంటే చూపించబడ్డ రెండు క్యారెక్టర్లు నోట్‌ప్యాడ్‌లోని టెక్ట్స్  భాగాలుగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న నోట్‌ప్యాడ్‌లో ఉన్న టెక్ట్స్ "ABCDEFG" కుడివైపుకు తరలించబడుతుంది, ఎందుకంటే మరో రెండు క్యారెక్టర్లు చొప్పించబడ్డాయి. మీరు ఇప్పుడు విజయవంతంగా రెండు సంప్రదాయ చైనీస్ క్యారెక్టర్లను IME ఉపయోగించి నమోదు చేశారు. 

జపనీస్ IME

కొన్ని జపనీస్ క్యారెక్టర్లను నమోదు చేయడం కొరకు నోట్‌పాడ్‌తో జపనీస్ IMEని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఈ సెక్షన్ వివరిస్తుంది.

  1. నోట్‌ప్యాడ్ లాంఛ్ చేయండి. నోట్‌ప్యాడ్‌లో కొన్ని క్యారెక్టర్లు టైప్ చేయండి. ఈ క్యారెక్టర్లు CTRL విండోని తరువాత మరింత మెరుగ్గా విజువలైజ్ చేయడానికి మీకు సహాయపడుతుంది. 

  1. నోట్‌ప్యాడ్‌ని యాక్టివ్ అప్లికేషన్ వలే, ఇన్‌పుటల్ లొకల్ ఇండికేటర్‌ క్లిక్ చేయండి మరియు కొరియన్ ఎంచుకోండి. కొత్త ఇన్‌పుట్ లాంగ్వేజ్ జపనీస్ అనే విషయాన్ని ప్రతిబింబించడం కొరకు ఇండికేటర్ డిస్‌ప్లే JPకు మారుతుంది. 

కర్సర్‌ని నోట్‌ప్యాడ్‌లో ఉంచండి. కీబోర్డు మీద హోమ్‌ని ప్రెస్ చేయండి, తద్వారా కర్సర్ లైన్  ప్రారంభంలో ఉంటుంది. కీబోర్డు మీద "N", తరువాత "I"ని టైప్ చేయండి. డిస్‌ప్లే  అప్పియరెన్స్‌ని దిగువ పటం చూపుతుంది. N+I  జపనీస్‌లో ఒక పూర్తి ఉచ్ఛారణ కనుక, యూజర్ నమోదు చేయాలని భావించే క్యారెక్టర్‌ని ఊహించడానికి IMEకి తగినంత సమయం ఉంటుంది. నోట్‌ప్యాడ్ కర్సర్  పైన ఒక క్యారెక్టర్ డిస్‌ప్లే అవుతుంది. ఈ క్యారెక్టర్ నోట్‌ప్యాడ్‌లో భాగం కాదు, నోట్‌ప్యాడ్  పైన మరో విండోలో డిస్‌ప్లే అవుతుంది మరియు మధ్యలో ఉన్న నోట్‌ప్యాడ్‌లో ఇప్పటికే ఉన్న క్యారెక్టర్లను దాచిపెడుతుంది. కొత్త విండోని కంపోజిషన్ విండో అని అంటారు, మరియు స్ట్రింగ్‌ని కంపోజిషన్ స్ట్రింగ్ అని అంటారు. కంపోజిషన్ స్ట్రింగ్ డిస్‌ప్లేలో అండర్‌లైన్ చేయబడుతుంది,.
మరో రెండు క్యారెక్టర్లు నమోదు చేయడం కొరకు "H", "O", "N", "G", మరియు "O" అని టైప్ చేయండి. దిగువ చూపించిన విధంగా కంపోజిషన్ స్ట్రింగ్‌లో ఇప్పుడు నాలుగు క్యారెక్టర్లు ఉంటాయి.
  1. స్పేస్ బార్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ చేయబడ్డ టెక్ట్స్‌ని IMEలోని మార్చమని ఇది ఆదేశిస్తుంది. దిగువ పటంలో, IME ''నిహంగో''  ఉచ్ఛారణకు కాంజీలో రాయబడ్డ క్లాజ్‌ని కన్వర్ట్  చేస్తుంది, అంటే 'జపనీస్ భాష' అని అర్థం. 

  1. ఒక్కసారి కీబోర్డు మీద డౌన్ యారోని ప్రెస్ చేయండి. దిగువ చూపించిన విధంగా నోట్‌ప్యాడ్  పైన ఒక విండో కనిపిస్తుంది. ఈ విండోని క్యాండిడేట్ విండో అని అంటారు. మీరు టైప్ చేసిన దాని  ఉచ్ఛారణకు జత అయ్యే క్లాజుల జాబితాను ఇది ప్రదర్శిస్తుంది. క్యాండిటేట్‌ల  జాబితా నుంచి ఉద్దేశించబడ్డ పదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ ఉదాహరణలో, ఒకే ఉచ్ఛారణతో మూడు క్యాండిడేట్ క్యారెక్టర్లు లభ్యం అవుతున్నాయి. రెండో ఎంట్రీ హైలైట్ చేయబడుతుందని మరియు కంపోజిషన్ స్ట్రింగ్ మారుతుందని గమనించండి. డౌన్ యారో టైప్ చేయడం వల్ల ఇది జరిగింది, ఇంతకు ముందు డిస్‌ప్లే చేయబడ్డ దాని తరువాత ఎంట్రీని ఎంచుకోవాలని IMEకి తెలియజేస్తుంది. 

  1. రెండో ఎంట్రీని ఎంచుకోవడం కొరకు ''2''ని టైప్ చేయండి. క్యాండిడేట్ విండో క్లోజ్ అవుతుంది, మరియు ఎంచుకోబడ్డ క్యారెక్టర్‌తో కంపోజిషన్ స్ట్రింగ్ అప్‌డేట్ చేయబడుతుంది. 

  1. ఎంటర్‌ని నమోదు చేయండి. కంపోజిషన్ పూర్తయిందని మరియు స్ట్రింగ్ నోట్‌ప్యాడ్‌కు పంపబడిందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది- ఈ ఉదాహరణలో నోట్‌ప్యాడ్. కంపోజిషన్ విండో క్లోజ్ అవుతుంది, మరియు రెండు క్యారెక్టర్లు WM_CHARద్వారా నోట్‌ప్యాడ్‌కు పంపబడుతంది.. దిగువ పటంలో అండర్‌లైన్ పోతుంది, ఎందుకంటే చూపించబడ్డ రెండు క్యారెక్టర్లు నోట్‌ప్యాడ్‌లోని టెక్ట్స్  భాగాలుగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న నోట్‌ప్యాడ్‌లో ఉన్న టెక్ట్స్ "ABCDEFG" కుడివైపుకు తరలించబడుతుంది, ఎందుకంటే మరో రెండు క్యారెక్టర్లు చొప్పించబడ్డాయి. మీరు ఇప్పుడు విజయవంతంగా కొన్ని కొరియన్ క్యారెక్టర్లను IME ఉపయోగించి నమోదు చేశారు.

కొరియన్ IME

కొన్ని కొరియన్ క్యారెక్టర్లను నమోదు చేయడం కొరకు నోట్‌పాడ్‌తో కొరియన్ IMEని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఈ సెక్షన్ వివరిస్తుంది.

  1. నోట్‌ప్యాడ్ లాంఛ్ చేయండి. నోట్‌ప్యాడ్‌లో కొన్ని క్యారెక్టర్లు టైప్ చేయండి. ఈ క్యారెక్టర్లు CTRL విండోని తరువాత మరింత మెరుగ్గా విజువలైజ్ చేయడానికి మీకు సహాయపడుతుంది.
Characters that help to visualize the IME window better later
  1. నోట్‌ప్యాడ్‌ని యాక్టివ్ అప్లికేషన్ వలే, ఇన్‌పుటల్ లొకల్ ఇండికేటర్‌ క్లిక్ చేయండి మరియు కొరియన్ ఎంచుకోండి. కొత్త ఇన్‌పుట్ లాంగ్వేజ్ కొరియన్ అనే విషయాన్ని ప్రతిబింబించడం కొరకు ఇండికేటర్ డిస్‌ప్లే KOకు మారుతుంది.
Input locale indicator to select Korean
కర్సర్‌ని నోట్‌ప్యాడ్‌లో ఉంచండి. కీబోర్డు మీద హోమ్‌ని ప్రెస్ చేయండి, తద్వారా కర్సర్ లైన్  ప్రారంభంలో ఉంటుంది, తరువాత "G"ని టైప్ చేయండి. డిస్‌ప్లే  అప్పియరెన్స్‌ని దిగువ పటం చూపుతుంది. "G"కి సంబంధించిన ఫోనిటెక్స్ ఎలిమెంట్ నోట్‌ప్యాడ్ మీద కనిపిస్తుంది మరియు బ్లాక్ కర్సర్‌తో ఇది హైలైట్ చేయబడుతుంది. హైలైట్ చేయబడ్డ క్యారెక్టర్‌ని కంపోజిషన్ స్ట్రింగ్ అని అంటారు. ఇతర భాషల కొరకు IMEలా కాకుండా, కంపోజిషన్ స్ట్రింగ్ నోట్‌ప్యాడ్‌కు పంపబడుతుంది మరియు యూజర్ సరళమైన ఫోనిటిక్ ఎలిమెంట్ ఎంటర్ చేసిన వెంటనే ఇప్పటికే ఉన్న టెక్ట్స్‌కు ఎడమ వైపు చొప్పించబడుతుంది
ఈ సమయంలో, కంపోజిషన్ స్ట్రింగ్‌లో మధ్యంతర క్యారెక్టర్ ఉంటుంది, ఎందుకంటే యూజర్ ద్వారా నమోదు చేయబడ్డ అదనపు ఫోనెటిక్ ఎలిమెంట్‌లు అందులో ఉన్న కంపోజిషన్ స్ట్రింగ్‌ని మారుస్తాయి. ఇప్పుడు "K"ని, తరువాత "S"ని టైప్ చేయండి. ప్రతి కీ స్ట్రోక్‌తో అంతర్గత క్యారెక్టర్ మారుతుందనే విషయాన్ని గమనించండి.
  1. ఇప్పుడు రైట్ CTRL కీని ప్రెస్ చేయండి. ఉచ్ఛారణ కొరకు నమోదు చేయబడ్డ వాటి కొరకు మీరు ఎంచుకోగల హింజా క్యారెక్టర్‌లను కనిపించే క్యాండిడేట్ విండో జాబితా చేస్తుంది, G+K+S. 

  1. లిస్ట్  మొదటి ఎంట్రీ ఎంచుకోవడం కొరకు న్యూమరికల్ ''1''ని టైప్ చేయండి. క్యాండిడేట్ విండో క్లోజ్ అవుతుంది, మరియు ఎంచుకోబడ్డ క్యారెక్టర్‌తో కంపోజిషన్ స్ట్రింగ్ అప్‌డేట్ చేయబడుతుంది. ​

"R", "N", మరియు "R"ని టైప్ చేయండి. మరో క్యారెక్టర్ నమోదు చేయడం కొరకు రైట్ CTRL కీని ప్రెస్ చేయండి.
  1. మొదటి ఎంట్రీని ఎంచుకోవడం కొరకు ''1''ని టైప్ చేయండి. మీరు ఇప్పుడు విజయవంతంగా రెండు కొరియర్ క్యారెక్టర్లను IME ఉపయోగించి నమోదు చేశారు. కొరియన్ క్యారెక్టర్లు ఇప్పటికే నోట్‌ప్యాడ్‌లోని టెక్ట్స్ స్ట్రింగ్  భాగం. ​


ఆవశ్యకతలు

ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ వోఎస్
లభ్యం అవుతున్న హార్డ్ డిస్క్ స్థలం కనీసం 230 MB
ఫారిన్ లాంగ్వేజ్ ఫైల్ లొకేషన్‌లు విండోస్ ఎక్స్‌పి ఇన్‌స్టలేషన్ కాంపాక్ట్ డిస్క్ లేదా నెట్‌వర్క్ లొకేషన్‌తో విండోస్ ఎక్స్‌పి ఇన్‌స్టలేషన్ ఫైళ్లు.
సమయం పారిన్ లాంగ్వేజ్‌ ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయడానికి సుమారు 10 నిమిషాలు పడుతుంది, నాలుగు విభిన్న IMEలను రివ్యూ చేయడానికి ప్రతిదానికి సుమారు 10నిమిషాలు. ​

​​​​​​​

Read More on...

​​​​
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.