Trace Id is missing
Golconda Fort near Hyderabad, Telangana

అన్ని భాషలు మరియు యాప్‌ల కొరకు ఉత్పాదకత

ఒక దేశం నిజంగా డిజిటల్‌గా మారాలంటే, వారు మాట్లాడే లేదా రాసే భాషతో సంబంధం లేకుండా టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలి మరియు అవి ఉత్పాదకంగా ఉండాలి. దేశంలో 22 అధికార భాషలున్నాయి, వాటిలో 6 భాషలు జనాభా రీత్యా టాప్ 20 గ్లోబల్ లాంగ్వేజ్‌ల్లో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని, Microsoft భారతీయ ప్రాంతీయ భాషల్లో ప్రొడక్ట్‌లు మరియు యాప్‌లకు మరింత ప్రాప్యత కల్పించడం కొరకు అవిశ్రాంతంగా శ్రమిస్తోంది.

Microsoft, 2000 సంవత్సరం నుంచి భారతీయ భాషల్లో నేటివ్ యూనికోడ్ సపోర్ట్‌ని అందించడంలో దిగ్గజంగా ఉంది. భాషా అడ్డంకులను చేధించడం కొరకు, మేం రెండు దశాబ్దాల క్రితం భారతీయ భాషల్లో పనిచేయడం ప్రారంభించాం మరియు భారతీయ భాషల్లో కంప్యూటింగ్‌‌ని వేగవంతం చేయడం కొరకు 1998లో ప్రాజెక్ట్ భాషాను ప్రారంభించాం. అప్పటి నుంచి మేం ఎంతో దూరం ప్రయాణించాం- మా ఉత్పత్తుల్లో భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా గుర్తించిన మొత్తం 22 భాషల్లో టెక్ట్స్ ఇన్‌పుట్‌కు మద్దతు ఇవ్వడంతోపాటుగా, Windows ఇంటర్‌ఫేస్ 12 భాషల్లో మద్దతు ఇస్తుంది. Bhashaindia.com, మా భాషా కమ్యూనిటీ పోర్టల్ భారతీయ కంటెంట్ మరియు టూల్స్ కొరకు ఒక ముఖ్యమైన రిపొజిటరీ.

భారతదేశంలో స్థానిక భాషల్లో ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. డిజిటల్‌గా మారడం వల్ల వ్యక్తులు స్వయం సాధికారతను సాధించడం కొరకు గొప్ప అవకాశం అందిస్తుందని ఇది తెలియజేస్తుంది. భారతీయ ప్రాంతీయ భాషల్లో పెద్ద సంఖ్యలో యాప్‌లను రూపొందించడంతో, విద్య, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, కమ్యూనికేషన్‌లు, ఈ కామర్స్, వినోదం, వ్యవసాయం, ఈ గవర్నెన్స్ మరియు ప్రయాణాలు వంటి రంగాలకు సంబంధించిన వనరులను కోట్లాది మంది ప్రజలు యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. భారతీయ భాషలతో పనిచేసే Microsoft ప్రొడక్ట్‌లు ఇవిగో:

Windows 10

కొత్త Windowsలో అత్యంత శక్తివంతమైన మరియు ఫీచర్ ప్యాక్డ్ OS ఉంది, ఇది భారతీయ భాషల్లో పనిచేస్తుంది. మీరు కేవలం తేలికగా టెక్ట్స్‌ని ఇన్‌పుట్ చేయడమే కాకుండా, Windows యూజర్ ఇంటర్‌ఫేస్‌ని మీకు నచ్చిన భాషలోనికి కన్వర్ట్ చేయవచ్చు. యూనికోడ్ స్టాండర్డ్‌కు మద్దతు ఇచ్చే వివిధ రకాలైన ఫాంట్‌లను సైతం మీరు ఉపయోగించవచ్చు, అలానే యూనికోడ్‌కు మద్దతు ఇచ్చే ఏదైనా అప్లికేషన్‌పై మీరు వర్చువల్‌గా పనిచేయవచ్చు. Microsoft Translator మరియు Mapsలు వంటి అనేక Windows యాప్‌లు భారతీయ భాషల్లో పనిచేస్తాయి, క్లుప్తంగా, Windows 10 భారతీయ భాషా వినియోగదారులకు అతడు/ఆమెకు చిరపరిచితమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

Office 365 

ఆఫీసు సూట్‌లు యూజర్‌లు తమ మాతృభాషల్లో కంటెంట్‌ని తేలికగా సృష్టించడానికి మరియు ఉపయోగించడానికి భౌగోళిక పరిధులు దాటి వివిధ రకాలైన ఫ్లాట్‌ఫారాలపై పని చేయడానికి దోహదపడుతుంది. Office యాప్‌లు అన్ని భారతీయ భాషల్లో పనిచేస్తాయి మరియు Windows 7 లేదా తరువాత వాటిపై రన్ చేయవచ్చు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సాయం చేయడం కొరకు వినియోగదారుల మరియు వాణిజ్య వినియోగదారులకు ఆఫీసు యాప్‌లు Windows, Android మరియు I O Sలపై లభ్యం అవుతున్నాయి.

Microsoft లాంగ్వేజ్ యాక్సెసబిలిటీ ప్యాక్ 

Microsoft, Windows మరియు Officeల్లో Microsoft లాంగ్వేజ్ యాక్సెస్ ప్యాక్‌ని ఉపయోగించి మద్దతు ఇస్తుంది, దీనిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ యాక్సెస్ ప్యాక్ Windowsలో 300,000 పదాలు మరియు Officeలో 600,000 పదాల వరకు అనువాదం చేస్తుంది. లాంగ్వేజ్ యాక్సెసరీ ప్యాక్‌లు యూజర్ ఇంటర్‌ఫేస్‌ని వాంఛిత భాషలోనికి కన్వర్ట్ చేస్తుంది మరియ స్థానిక భాషల్లో ఆదేశాలు మరియు డైలాగ్ బాక్సులను అందిస్తుంది.

ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్‌లు

Windows ప్రామాణిక ఇండిక్ కీబోర్డుల కొరకు బిల్ట్ ఇన్ సపోర్ట్‌తో వస్తుంది, కొంతమంది వినియోగదారులు ట్రాన్స్‌లిటరేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాలు ఉపయోగించే టెక్ట్స్ ఇన్‌పుట్ చేయడానికి ఇష్టపడతారు. అటువంటి వినియోగదారుల కొరకు Bhashaindia.comపై Microsoft వివిధ రకాలైన ఇన్‌పుట్ మెథడ్ ఎడిటర్స్ (I M Eలు) అందుబాటులో ఉంచింది. 

Bing

సెర్చ్ టూల్ తొమ్మిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. భారతీయ భాషల అనుభవం డెస్క్‌టాప్ అదేవిధంగా మొబైల్ పరికరాలపైన కూడా లభ్యం అవుతుంది. Bing Translator అనేక భారతీయ భాషల్లో లభ్యం అవుతుంది.

Skype Lite

Android కొరకు వేగవంతమైన మరియు తేలికపాటి వెర్షన్ Skype యాప్ సృష్టించబడింది, భారతదేశ ప్రజలు మరింత అనుసంధానం కావడం కొరకు ఇది అభివృద్ధి చేయబడింది, సవాళ్లతో కూడుకున్న వాతావరణంలో ఇది గొప్ప పనితీరును అందిస్తుంది. యాప్ 11 భారతీయ స్థానిక భాషల్లో లభ్యం అవుతుంది: ఇంగ్లిష్‌కు అదనంగా బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడం, మలయాళం,మరాఠీ, ఒడియా, పంజాబీ,తమిళం, తెలుగు, మరియు ఉర్దూభాషలు. 

Kaizala App

పెద్ద గ్రూపు కమ్యూనికేషన్‌లు మరియు వర్క్ మేనేజ్‌మెంట్ కొరకు, రిమోట్ లొకేషన్‌ల్లో 2G నెట్‌వర్క్ ద్వారా యాక్సెస్ కొరకు ఆప్టిమైజ్ చేయడానికి Kaizala మొబైల్ యాప్ డిజైన్ చేయబడింది. యాప్, Android మరియు I O S యూజర్‌ల కొరకు హిందీ, బెంగాలీ మరియు తెలుగు భాషల్లో లభ్యం అవుతుంది. 

SwiftKey

Android మరియు I O S యూజర్‌ల కొరకు AI పవర్‌ని లీవరేజ్ చేసేకీబోర్డు ఇది మార్వారీ, బోడో, సంతాలీ మరియు ఖోసితో సహా 24 భారతీయ భాషలు మరియు యాసల్లో టెక్ట్స్ ఇన్‌పుట్ చేయడానికి అనుమతిస్తుంది. కీప్యాడ్‌ల్లో AIని తీసుకొని రావడం ద్వారా, వేగంగా మరియు ఊహించి రాయడానికి ఆస్కారం కల్పిస్తుంది. ఇది యూజర్‌లు మిక్సిడ్ లాంగ్వేజ్‌లు టైప్ చేయడానికి దోహదపడుతుంది. 

భాషా అనువాదం

భారతీయ భాషల్లో రియల్ టైమ్ లాంగ్వేజ్ అనువాదాన్ని మెరుగుపరచడం కొరకు, కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డీప్ న్యూరల్ నెట్‌వర్క్‌లు (DNN)లకు లీవరేజ్ చేసింది. ఇది Microsoft బ్రౌజర్‌లపై ఏదైనా వెబ్‌సైట్, Bing సెర్చ్, అదేవిధంగా Microsoft Office 365 ప్రొడక్ట్‌లను సర్ఫ్ చేయడం ద్వారా, యూజర్‌లు భారతీయ భాషల అనువాదాన్ని పొందడానికి ఇది సహాయపడుతుంది.‌ Windows మరియు Androidపై Microsoft ట్రాన్స్‌లేటర్ యాప్‌లో AI మరియు DNNలను ఉపయోగిస్తుంది.

Sway

మల్టీమీడియా కంటెంట్ సాయంతో స్తానిక భాషల్లో కొత్త ఆలోచనలు, స్టోరీలు, రిపోర్టులు మరియు ప్రజంటేషన్‌లను వ్యక్తం చేయడానికి Sway యాప్ ఉపయోగపడుతుంది. యూజర్‌లు డిజైన్ మరియు లేవుట్ గురించి పెద్దగా ఆందోళన చెందకుండానే సంబంధిత ఇమేజ్‌లు, వీడియోలు, ట్వీట్‌లు మరియు ఇతర కంటెంట్‌లను ఉపయోగించడంలో సహాయపడటం కొరకు యాప్ స్థానిక భాషల్లో సెర్చ్‌ని అందిస్తుంది.

OneNote

OneNote అనేది చేయాల్సిన పనుల జాబితా, లెక్చర్ మరియు మీటింగ్ నోట్‌లు, వెకేషన్ ప్లాన్‌లు, లేదా ఒక వ్యక్తి ఏదైనా నిర్వహించాలని లేదా గుర్తుంచుకోవాలనే దేనికైనా ఒక డిజిటల్ నోట్‌బుక్. యూజర్‌లు స్థానిక భాషల్లోటైప్ చేసి, స్క్రిబిల్ చేయవచ్చు, రికార్డ్ చేయవచ్చు మరియు పంచుకోవచ్చు. OneNote, PC, Mac, విండోస్ ఫోన్, ఐఫోన్, ఐఫ్యాడ్,యాపిల్ వాచ్, Android మరియు Android ధరించే పరికరాల్లో లభ్యం అవుతుంది.

ఇండిక్ ఇమెయిల్ చిరునామాలు

Android మరియు I O Sపై Outlook యాప్‌తో సహా, దాని ఇమెయిల్ యాప్‌లు మరియు సర్వీస్‌ల్లో 15 భాషల్లో Microsoft ఇమెయిల్ చిరునామాలకు మద్దతు ఇస్తుంది. ఈ సపోర్ట్ భవిష్యత్తు సిద్ధమైంది. డొమైన్ పేర్లు అదనపు భారతీయ భాషల్లో లభ్యం అవుతుందో, అప్పుడు, ఆ భాషల్లో ఇమెయిల్ చిరునామాలకు మేం ఆటోమేటిక్‌గా మద్దతు అందిస్తాం.

సొసైటీలో విస్రృత శ్రేణి వర్గాలకు టెక్నాలజీ యాక్సెస్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా, ప్రస్తుత భాషా అడ్డంకులను అధిగమించి, భారతదేశంలో లోకలైజేషన్ డ్రైవ్ తరువాత స్థాయికి వెళుతుందని ఆశించవచ్చు.