Go Search

 

మైక్రోసాఫ్ట్ సేవల సమాహారం విండోస్ లైవ్

 

 

మైక్రోసాఫ్ట్ సేవలు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల సమాహారమే విండోస్ లైవ్. ఈ సేవల్లో అత్యధికం వెబ్ అప్లికేషన్లు. విండోస్ లైవ్ పేరిట ఒకచోట చేర్చిన ఈ అప్లికేషన్లలో కొన్నిటి గురించి తెలుసుకుందాం..


రైటర్

విండోస్ లైవ్ రైటర్ ద్వారా బ్లాగింగ్ కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించుకోవచ్చు. పలు బ్లాగింగ్ సర్విసులలో మీ ఫొటోలు, వీడియో ఫార్మాట్ ఫైళ్లను పబ్లిష్ చెయ్యవచ్చు. Windows Liveతో బాటు Wordpress, Blogger, Live Journal, Type Pad, SharePoint, Community Server వంటి పలు ఏ ఇతర బ్లాగ్ సర్వీస్‌లోకైనా పబ్లిష్ చెయ్యడానికి రైటర్ అనుమతిస్తుంది. ఫాంట్లు, స్పేసింగ్, రంగులు, చిత్రాలను బ్లాగ్‌లో పబ్లిష్ చెయ్యడానికి ముందే ప్రీవ్యూ చూడవచ్చు. MSN Videoలోని Soapbox  లేదా YouTubeలో వీడియోలను పబ్లిష్ చేసుకోవడానికి రైటర్ అనుమతిస్తుంది. దీనిని మీ బ్లాగ్‌లో ఎంబెడ్ చేసుకోవచ్చు. రైటర్‌లో ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లున్నాయి. అదనంగా ప్లగిన్‌లను మీరు చేర్చవచ్చు. ఇంకెన్నో చెయ్యవచ్చు.

 

ఐఎం (ఇన్‌స్టంట్ మెసెంజర్)

మెసెంజర్ ద్వారా మీరు నిరంతరం అందుబాటులో ఉండేలా విండోస్ లైవ్ సహకరిస్తుంది. దీని ద్వారా మీరు చాటింగ్, ఫొటోల మార్పిడి, ఆటలాడుకోవడం, చిత్రాల్ని ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చెయ్యవచ్చు. మీ మనోభావాలకు దర్పణం పట్టేలా మీకు సంబంధించిన చిత్రాలు, షార్ట్ వీడియోలను చేర్చవచ్చు. మీరు వింటున్న సంగీతాన్ని ఇతరులూ ఆస్వాదించవచ్చు. సంభాషణ జరుపుతున్న విండోలోని దృశ్యాన్ని మార్చుకోవచ్చు. మీరు సంభాషిస్తున్నప్పుడే ఆ విండోలోకి ఫొటోలను డ్రాగ్ చెయ్యవచ్చు. మీ చిత్రాలను వారి కంప్యూటర్లలో సేవ్ చేసుకోవడానికి మీరు వీలు కల్పించవచ్చు. మీతో చాట్ చేస్తున్న వ్యక్తులు వారి కంప్యూటర్‌ను విడిచి వెళ్లినప్పుడు, వారి మొబైల్ ఫోన్‌కు మెసెంజర్ ద్వారా ఎస్ఎంఎస్ టెక్ట్స్ సందేశం పంపవచ్చు.

 

ఇ-మెయిల్

మీ Hotmail, Gmail తదితర అకౌంట్లన్నిటినీ మల్టిపుల్ క్యాలెండర్లతో పాటు ఒకేచోటికి చేర్చుతుంది మెయిల్. మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా పాత సందేశాలు, క్యాలెండర్ ఈవెంట్లను యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు బదులిచ్చేందుకుగాను సందేశాలను సిద్ధం చేసుకొని, తర్వాత రీకనెక్ట్ అయినప్పుడు పంపుకొనవచ్చు. ఒకటికంటే ఎక్కువ ఇ-మెయిల్ అకౌంట్ల మధ్య భద్రతా వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి విండోస్ లైవ్ మెయిల్ సహకరిస్తుంది. మీకు వచ్చిన సందేశం అనుమానాస్పదంగా ఉంటే స్పామ్ ఫిల్టర్లు మిమ్మల్ని అప్రమత్తం చేస్తాయి. ఒక్క క్లిక్‌తో ఆ సందేశాన్ని తొలగించవచ్చు, దానిని పంపినవారిని నిరోధించవచ్చు. విండోస్ లైవ్ మెయిల్‌లోని మీ క్యాలెండర్ మీ ముఖ్యమైన అపాయింట్‌మెంట్ల నిర్వహణలో మీకు తోడ్పాటునిస్తుంది. మీరు ముందుగా సూచించిన మేరకు ఇ-మెయిళ్ల ద్వారా లేదా మీ మొబైల్ ఫోన్‌కు లేదా మెసెంజర్‌కు రిమైండర్లు పంపుతుంది

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.